TG: ఎయిర్పోర్టు ప్రయాణికుల కోసం TGRTC ఏర్పాట్లు చేసింది. శంషాబాద్లో ఆర్టీసీ స్లీపర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరుకు బయల్దేరనున్నాయి. బెంగళూరుకు స్లీపర్ క్లాస్ బస్సు టికెట్ ధర రూ.1730, చెన్నైకి టికెట్ ధర రూ.2,030గా అధికారులు నిర్ణయించారు. అలాగే.. రాజమండ్రి, కాకినాడ, విశాఖకు అదనపు బస్సులను నడపనుంది.