TG: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సినీ ప్రముఖల పేర్లు ఖరారైనట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ‘వన్ కంట్రీ-మెనీ సినిమాస్’ పేరుతో ఈనెల 9న గ్లోబల్ సమ్మిట్‌లో చర్చ జరగనున్నట్లు తెలిపారు. ఎయిర్‌లైన్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథులకు సమస్య వస్తే.. ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామన్నారు.