BHPL: గణపురం మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి దాసరి సునీత రవీందర్, 10వ వార్డు అభ్యర్థి కొండి కుమారస్వామి తరపున ఇవాళ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రామప్ప కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బ్యాట్, గౌను గుర్తులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.