VZM : ప్రజా వైద్యం.. ప్రజా హక్కు అని MLC బొత్స సత్యనారాయణ కుమార్తె డా.బొత్స అనూష అన్నారు. గుర్ల మండలం, కెల్ల గ్రామంలో శనివారం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ప్రజల మద్దత్తతో సంతకాలు సేకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేవీ సూర్యనారాయణ, ఎంపీపీ పొట్నూరు సన్యాసినాయుడు పాల్గొన్నారు.