MLG: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ను ములుగు ఎస్పీ సుధీర్ కేకన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఓఎస్ఓ శివం ఉపాధ్యాయతో కలిసి వెళ్లిన ఎస్పీ.. సీపీతో కొద్దిసేపు సమావేశమయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణ, స్పెషల్ ఆపరేషన్ల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఎస్పీని అభినందించిన సీపీ సమర్థవంతమైన పోలీసు సేవల కోసం పరస్పరం సహకరించుకోవాలని అభిప్రాయపడ్డారు.