MDK: రామాయంపేట మండలం కాట్రియాలలో శనివారం డా.బీ.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద జై భీమ్ ప్రెసిడెంట్ మైలారం రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్ యూత్ సభ్యులు ఏసు మాట్లాడుతూ.. అంబేడ్కర్ అంటరానితనం నిర్మూలనకు, బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం ఎంతో పోరాడారని గుర్తు చేసుకున్నారు.