TG: వరుసగా నాలుగోరోజూ ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. HYDకు రావాల్సిన 26 ఇండిగో విమానాలు, HYD నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. విమానాశ్రయాల్లో ఉన్నవారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. 37 రైళ్లకు 116 కోచ్లు అదనంగా జోడించాలని నిర్ణయం తీసుకుంది.