వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్ సభలో ప్రధాని మోదీ ఈ నెల 8న, రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 9న ఈ చర్చను ప్రారంభిస్తారు. సోమవారం రోజంతా దీనిపై చర్చ జరగనుంది. రాజ్యసభలో జరిగే చర్చలో కేంద్రమంత్రి జె.పి.నడ్డా కూడా భాగస్వామి అవుతారు.