ఎదుటివారి దగ్గర మీ విశ్వసనీయతను పెంచుకోవడానికి ఒక్కటే దారి ఉంది. మీరు చేస్తామని మాట ఇచ్చిన పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి చూపించడం. అది కూడా గడువులోపే పూర్తి చేయడం. ఇంతకుమించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈ సూత్రాన్ని పాటించేవారిని.. అవకాశాలైనా, అవసరమైనప్పుడు డబ్బులైనా వెతుక్కుంటూ వస్తాయి.