NLG: దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో BRSV రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజును ఇవాళ తెల్లవారుజామున ముందస్తుగా అరెస్ట్ చేసి దేవరకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. వేముల రాజును అరెస్ట్ చేయడాన్ని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, BRSV రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.