ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి నివాసంలో శనివారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల కన్వీనర్ తాతిరెడ్డి లోకనాథ్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. మండలంలోని ప్రజలు, రైతులు వారి సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.