MBNR: జిల్లాలో మొదటి విడతలో గండీడ్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్ నగర్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 8న తమ ఫారం-14 తీసుకొని నేరుగా తమ ఓటు హక్కు ఉన్న మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో వినియోగించుకోవాలన్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తమ ఓటును వేయొచ్చని కలెక్టర్ విజయేంది బోయి అన్నారు.