212 Biryani Sold: బిర్యానీ (Biryani) అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. లొట్టలేసుకుంటూ మరీ తింటారు. ఇక ఏదైనా పండుగ అయితే ఆ సెలబ్రేషన్ వేరే.. ఐపీఎల్ కూడా ఓ పండుగ.. దాదాపు 2 నెలలు టీవీలకు అతుక్కుపోయారు. బెట్టింగ్ చేసేవారు చేశారనుకొండి.. ఐపీఎల్ (IPL) సమయంలో ఫుడ్ ఆర్డర్ ఎక్కువగా జరిగిందట.. బిర్యానీలు తెగ తిన్నారని.. స్విగ్గీ (Swiggy) తెలిపింది.
ఐపీఎల్ 2023 టైటిల్ను సీఎస్కే (csk) గెలుచుకుంది. సీజన్ మొత్తం తమకు 12 మిలియన్ ఆర్డర్స్ (12 million orders) వచ్చాయని స్విగ్గీ (swiggy) పేర్కొంది. అంటే 1.20 కోట్ల బిర్యానీలను సప్లై చేశారట. అంటే నిమిషానికి 212 బిర్యానీలను స్విగ్గీ బాయ్స్ (boys) కస్టమర్లకు అందజేశారు. ఈ మేరకు స్విగ్గీ ట్వీట్ చేసింది. దీనిని బట్టి సీజన్లో ప్రేక్షకుల మనస్సును బిర్యానీ గెలుచుకుందని తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్లో స్విగ్గీ స్పెషల్ ఆఫర్ (special offer) ఇచ్చింది. క్రికెట్ ఫ్యాన్స్ కోసం 50 శాతం వరకు డిస్కౌంట్ కూడా ఇచ్చింది.
తమ సంస్థలో బిర్యానీ (biryani) ఆర్డర్ ఎక్కువ అని పేర్కొంది. నిజమే.. తింటే బిర్యానీయే తినాలి.. కదా, అందుకే ప్రేక్షకులు ఆర్డర్ చేశారు. నిమిషానికి 212 బిర్యానీలు అంటే.. గంటకు 12,720 బిర్యానీలు అందజేశారు. ఒకరోజు.. 24 గంటలకు 3,05, 280 బిర్యానీలు ఆర్డర్లను స్విగ్గీ పొందింది.
biryani wins the trophy for the most ordered food item this season with over 12 million orders at 212 BPM (biryanis per minute) 🏆