MHBD: గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించాలని, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, రవాణా, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ప్రతి పనిని పక్కాగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.