ADB: సీపీఆర్ పై ప్రతిఒక్క విద్యార్ధి అవగాహన కలిగి ఉండాలని వైద్యాధికారి రాంబాబు అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు CPRపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు సీపీఆర్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటకేశవులు, డా. జితేంద్ర రెడ్డి, తులసీదాస్ ఉన్నారు.