ఫైనాన్షియల్, టెక్నికల్ ఇష్యూల వల్ల ‘అఖండ 2’ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న లేదా వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు బుక్ మై షోలో కూడా 2026లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు చూపించడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.