KRNL: ఆదోని-ఎమ్మిగనూరు జాతీయ రహదారి మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇటీవల కారు ప్రమాదంలో ఆరుగురు, ఆటో ప్రమాదంలో ఇద్దరు, లారీ ఢీకొని తండ్రి (లస్కర్), కొడుకు మృతి చెందిన విషయం తెలిసిందే. కోటేకల్ వద్ద రెండు మలుపుల్లో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగడానికి అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రధాన కారణమైనా వేగ నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.