VZM: జిల్లాలో ఎక్కడైనా మాతృ, శిశు మరణాలు సంభవిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని DRC సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అత్యున్నత ప్రభుత్వ యంత్రాగం ఉందని, ప్రభుత్వం మంచి పోషకాహారాన్ని సరఫరా చేస్తోందని, అయినప్పటికీ అక్కడక్కడా మాతృ, శిశు మరణాలు సంభవించడం బాధాకరమన్నారు.