కృష్ణా: చల్లపల్లిలో అప్పుల బాకీలతో పరారైన మద్దుల వెంకట సుబ్బారావుకు చెందిన షాపును గురువారం ఆప్కాబ్ బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. 2021లో బ్యాంక్ నుంచి రూ.2 లక్షల రుణం తీసుకున్న సుబ్బారావు, వివిధ చోట్ల రూ. 50 లక్షలకు పైగా అప్పులు చేసి 2023లో ఉడాయించాడు. స్టాక్‌ను లెక్కించి, త్వరలో అధికారుల ఆదేశాల మేరకు 15 రోజుల్లో వేలం నిర్వహిస్తామని అధికారులు చెప్పారు.