చిత్తూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్తున్న లారీ RKVB పేట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ను రక్షించేందుకు రామలింగం, గిరిబాబు వెళ్లారు. ఈలోగా పళ్లిపట్టుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. రామలింగం మృతి చెందగా, గిరిబాబు రుయాలో చికిత్స పొందుతున్నాడు.