KKD: పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పాడా) ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ)గా బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ. శ్రీనివాసరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ షాన్మోహన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ పదవిలో ఉన్న చైత్రవర్షిణిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీ చేయడంతో, ఆమె స్థానంలో శ్రీనివాసరావును నియమించారు.