WNP: మదనాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామకృష్ణను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రకటించారు. పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన గోపిస్వామి, సత్యశీలా రెడ్డి, రాఘవేందర్లతో గురువారం ఎమ్మెల్యే చర్చించారు. ఎమ్మెల్యే సూచన మేరకు వారు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో, రామకృష్ణను ఏకగ్రీవంగా పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.