VZM: పట్టణంలోని స్థానిక ప్రభుత్వ BC వసతి గృహంలో ఓ విద్యార్ధిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమే మహారాజా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వాతిగా పోలీసులు గుర్తించారు. ఈమె స్వస్థలం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంగా తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు కొనసాగిస్తున్నారు.