W.G: క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ల (CRMT) సమస్యలను పరిష్కరించాలని CRMT బత్తుల నాని బాబు విజ్ఞప్తి చేశారు. గురువారం ఈ మేరకు తాడేపల్లిగూడెం MEO హనుమకు వినతిపత్రం అందజేశారు. క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, సీఆర్ఎం టీచర్లకు ఎమ్ఎస్ ఇప్పించాలని, వేతనాలు పెంచాలని నాని బాబు కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.