MBNR: జడ్చర్ల మండలం గంగాపూర్లో నామినేషన్ పరిశీలన కేంద్రాలను సాధారణ ఎన్నికల అధికారి కాత్యాయని దేవి గురువారం పరిశీలించారు. సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు.