SRD: ఇటీవల కురిసిన వర్షాల వల్ల హాద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై గుంతలు ఏర్పడిన గుంతలను ఎస్సై సుజిత్ ఆధ్వర్యంలో గురువారం కాంక్రీట్ తో పూడ్చివేయించారు. ఎస్సై మాట్లాడుతూ.. గుంతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో రోడ్డుకు మరమ్మత్తులు చేయించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.