ASR: స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో డా. కృష్ణమూర్తి నాయక్ గురువారం ఆదేశించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్క్రబ్ టైఫస్ అనేది ఒక జూనోటిక్ వ్యాధి అన్నారు. పొలాలు, తోటల్లో పనిచేసే వ్యక్తులకు, రైతులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు.