SKLM: రైతుల గురించి మాట్లాడే హక్కు మాజీ ముఖ్యమంత్రి జగన్కు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు అన్నారు. ఇవాళ టెక్కలిలో విలేకరులతో మాట్లాడుతూ.. బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారానికి ఒకసారి రాష్ట్రానికి వచ్చే వాళ్ళకి రైతుల గురించి ఏం తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వస్తే అన్ని చర్చిద్దాం రండి అని పిలుస్తున్నామని అన్నారు.