NLR: చూడటానికి ఎంతో బాగుంటుంది. వర్షం వస్తేనే అసలు విషయం ఏంటో తెలుస్తుంది. చిన్నపాటి వర్షం కురిసినా సిటీలోని అండర్ పాస్‌లు నిండిపోతాయి. గురువారం మధ్యాహ్నం వర్షం దంచికొట్టడంతో అండర్ పాస్‌ల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. చాలామంది విజయమహల్ గేట్ అండర్ బ్రిడ్జి వైపు వచ్చారు. ఇది కూడా మునిగిపోవడంతో ట్రాఫిక్ నిలిచింది.