ADB: ఆదిలాబాద్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు రోశయ్యను నిఖార్సైన రాజకీయవేత్తగా, నిజాయితీపరుడిగా కొనియాడారు. నలుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన ఆర్థికవేత్త అని ప్రశంసించారు. ఆర్యవైశ్యులు రోశయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.