E.G: శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి జయంతి సందర్భంగా దూబచర్ల శ్రీ దత్తసాయి పంచావతార మహాపీఠంలో జయంత్యోత్సవాలకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గురువారం హాజరయ్యారు. ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. పీఠంలో 50 మంది గురు దత్త దీక్షాదారులకు ఇవాళ ఇరుముడి కార్యక్రమం, మహన్యాసపూర్వక అభిషేకాలు, జరుగునున్నాయి.