ADB: ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో నిర్వహించిన సాయిబాబా బ్రహ్మోత్సవాల్లో MLA పాల్గొన్నారు. మాజీమంత్రి జోగు రామన్నతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులంతా సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టటం గొప్ప విషయమని అన్నారు.