ప్రముఖ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత శ్రీ శరవణన్ మృతిపై AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ‘శరవణన్ మరణవార్త విని నేను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన వైవిధ్యమైన కథలను, కుటుంబసమేతంగా చూసే విలువలతో కూడిన మూవీలను నిర్మించారు. సినీపరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర కలిగిన AVMను సమర్థవంతంగా నడిపారు’ అని తెలిపారు.