VKB: వేరుశనగ రైతులకు నాసిరకం మందుల విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కుల్కచర్ల వ్యవసాయ అధికారి వీరస్వామి తెలిపారు. ఫర్టిలైజర్ విక్రయంపై రైతుల ఫిర్యాదుతో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. డేట్ ఎక్స్ఫైరీ అయిపోయిన మందులను రైతులకు విక్రయించరాదన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.