SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజలు సమస్యలను తెలుసుకొనేందుకు స్థానిక ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు గురువారం తన కార్యాలయంలో డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు అందించిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.