కృష్ణా: గురువారం అవనిగడ్డ వంతెన సెంటర్లో ఘంటసాల జయంతి, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల చిత్రపటానికి, కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేటికీ ఘంటసాల గానామృతం శ్రోతలను పరవశింప చేస్తూనే ఉందని దివిసీమ లలిత కళా సమితి అధ్యక్షులు పుప్పాల వీరాంజనేయులు అన్నారు.