గద్వాల: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల్లోని 75 గ్రామ పంచాయతీలకు, 700 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 38 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 46 నామినేషన్లు దాఖలయ్యాయి.