ADB: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్న PDSU రాష్ట్ర నాయకులను అరెస్టు చేయటం సమంజసం కాదని జిల్లా కార్యదర్శి అశోక్ బుధవారం అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 4న నిర్వహించే CM సభను అడ్డుకుంటామని తెలియజేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలన్నారు. విద్య రంగానికి 30% నిధులు కేటాయించాలని కోరారు.