»Inspired By Akshay Kumar Movie Robbery In The Name Of Fake Officer Secunderabad
Fake it Officers: అక్షయ్ మూవీ చూసి ప్రేరణ..ఫేక్ ఆఫీసర్ల పేరుతో దోపిడీ
పలువురు దుండగులు అక్షయ్‌కుమార్ నటించిన 'స్పెషల్ 26' సినిమాతో పాటు పలు చిత్రాలు(movies) చూసి దోపిడీకి ప్లాన్ చేశారు. ఆ నేపథ్యంలో 8 నుంచి 10 మంది కలిసి సికింద్రాబాద్‌లోని ఓ నగల దుకాణంలోకి ఐటీ అధికారులమని వెళ్లారు. 60 లక్షల రూపాయల విలువైన 17 బంగారు కడ్డీలను దోచుకెళ్లారు.
ఓ దొంగల ముఠా ఈసారి కొత్తగా ప్రయత్నించారు. కానీ మళ్లీ అడ్డంగా దొరికిపోయారు. అయితే ఇటీవల అక్షయ్‌కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ సినిమాతో పలు చోరీ సినిమాలు చూసి దోపిడీకి ప్లాన్ వేశారు. ఆ క్రమంలో ఐటీ అధికారులమని చెప్పి సికింద్రాబాద్(secunderabad) మార్కెట్ ప్రాంతంలోని సిద్ధివినాయక్ అనే నగల దుకాణంలోకి వెళ్లారు. ఆ నేపథ్యంలో 8 నుంచి 10 మంది వెళ్లి ఆదాయపు పన్ను శాఖ అధికారులుగా నటిస్తూ రూ.60 లక్షల విలువైన 17 బంగారు బిస్కెట్లను అపహరించారు. మే 27న మోండా మార్కెట్ పరిధిలో ఇది చోటుచేసుకుంది.
హైదరాబాద్(hyderabad)కు చెందిన మహేందర్ బాబా దిల్ సుఖ్ నగర్లో సిద్ధివినాయక పేరుతో గోల్డ్ షాపు(gold shop) నిర్వహిస్తున్నాడు. అతని వర్క్ షాపు ఒకటి చిక్కడపల్లిలో ఉండగా..మరోకటి సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో ఉంది. ఆ షాపులో పాత బంగారం కరిగించి ఆభరణాలు తయారు చేస్తారు. ఆ క్రమంలో నెల రోజుల క్రితం పాట్ మార్కెట్లోని హర్షద్ గోల్డ్ మెల్టింగ్ షాపులో మహారాష్ట్రకు చెందిన జాఖీర్ ఘని పనికి చేరాడు. అతను అత్తర్ కరిగించి బంగారాన్ని తీసుకుని నగల తయారీ కోసం సిద్దివినాయక షాపుకు వెళ్తుంటాడు. ఆ క్రమంలో అక్కడ జరిగే కార్యకలాపాలు, బంగారు బిస్కెట్ల తయారీ విధానం జాఖీర్ గమనించాడు. ఆ విషయం తన స్నేహితులకు తెలిపి దోపిడీ చేద్దామని ప్లాన్ వేశారు.
ఆ నేపథ్యంలో ఫేక్ ఐటీ అధికారులు(fake it officers)గా అవతారమెత్తారు. ఈనెల 24న మహారాష్ట్ర ఖానాపూర్ కు చెందిన రహ్మాన్ గపూర్ అత్తర్, ప్రవీణ్ యాదవ్, ఆకాశ్ అరుణ్ హవ్లీ, అభిజిత్ కుమార్ గోడ్కె, అమెల్ గన్ ప్రతాప్ జాదవ్ కలిసి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. వీరితోపాటు గోవాకు చెందిన సిద్ధార్థ జాదవ్, సంజయ్, పరశురామ్ జాదవ్, శుభం వినోద్ జాదవ్, అజయ్ వినోద్ జాదవ్ ట్రైన్లో హైదరాబాద్ వచ్చేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జీ(lodge)లో బస ఏర్పాటు చేసుకుని ఈనెల 27న ఉదయం 11 గంటల ప్రాంతంలో నగల దుకాణానికి వెళ్లారు. ఆ షాపుకు వెళ్లిన వెంటనే ఐటీ అధికారులమని చెప్పి వారి ఫోన్లు కూడా లాక్కున్నారు. వారిని గదిలో బంధించి 17 బంగారు బిస్కెట్లు తీసుకుని పారిపోయారు. ఇక బాధిత వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా మహారాష్ట్రలో తలదాచుకున్న నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 7 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతర నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.