కృష్ణా: బంటుమిల్లి మండలం బంటుమిల్లి, అర్థమూరు గ్రామాల్లో జరుగుతున్న అయ్యప్ప స్వాముల దీక్ష, ఇరుముడి కార్య క్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే, అయ్యప్ప దీక్షదారుల భక్తి, నియమాచారాలను అభినందిస్తూ సురక్షితంగా ప్రయాణం పూర్తిచేసుకోవాలని ఆకాంక్షించారు.