TG: లిప్ట్, ఎలివేటర్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. లిప్ట్ అంశాలపై చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే దానిని అమలు చేయడానికి మరెన్నేళ్లు పడుతుందని వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాలలో లిప్ట్, ఎలివేటర్ అంశాలపై అవలంభిస్తున్న మార్గదర్శకాలను అనుసరించి నూతనంగా చట్టాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.