ELR: మెడికల్ కాలేజీలో ఈనెల 12న జరగబోయే ఫెస్ట్ గురించి మాట్లాడేందుకు వచ్చిన సీనియర్లు, జూనియర్ల మధ్య ఈనెల 1వ తేదీ రాత్రి అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో నలుగురు సీనియర్లు తనపై దాడి చేశారని జూనియర్ విద్యార్థి రాకేశ్ రెడ్డి మంగళవారం రాత్రి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఎస్సై మధు వెంకటరాజా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.