RR: ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్‌గా గోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా గోపాల్ రెడ్డి నామినేషన్ వేయగా.. మరో ఐదుగురు కూడా నామినేషన్ వేశారు. మిగతా నాయకులు నామినేషన్ ఉపసంహరించుకోగా.. బరిలో గోపాల్ రెడ్డి ఒక్కరే నిలిచారు. దీంతో బుధవారం గోపాల్ రెడ్డిని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.