దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 90 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. కాగా, తొలి వన్డేలో సైతం కింగ్ కోహ్లీ (135) సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో విరాట్ నుంచి వరుసగా రెండో సెంచరీ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.