సోషల్ మీడియాలో ప్రస్తుతం AI ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను అసభ్యకర రీతిలో ఎడిట్ చేసి కొందరు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖుల వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ అంశంపై రష్మిక మందన్న స్పందిస్తూ.. మానవుల్లాగా ప్రవర్తించని వారికి శిక్ష విధించాలంటూ Xలో పోస్ట్ పెట్టింది. దానికి సైబర్ దోస్త్ అకౌంట్‌ను ట్యాగ్ చేసింది.