కృష్ణా: జి. కొండూరు మండల పరిషత్ స్కూల్లో దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ పాల్గొన్నారు. దివ్యాంగ విద్యార్థులకు బహుమతులు అందజేసి, ఉపాధ్యాయులను సన్మానించారు. దివ్యాంగులు సాధారణ విద్యార్థులతో సమానమని, వారు కూడా ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆమె తెలిపారు.