తనపై నమోదైన బెంగళూరు రేవ్ పార్టీ కేసును కొట్టేసిన విషయాన్ని తక్కువమంది రాశారని నటి హేమ తెలిపింది. తాను బర్త్ డే పార్టీకి వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ డ్రగ్స్ దొరికాయని, కానీ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన హేమ అని రాశారని చెప్పింది. ఆ సమయంలో తనకు రోజుకు 500 ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపింది. వాటికి సంధానం చెప్పలేక వీడియో చేసి పెట్టానని, దాన్ని కూడా తప్పుగా చూపారని పేర్కొంది.