మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనికి ‘ఇరుముడి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ కూతురిని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి పడే తాపత్రయం నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. త్వరలోనే ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.