భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP సిరిశెట్టి సంకీర్త గౌడ్ హెచ్చరించారు. ఇవాళ జిల్లా కేంద్రంలో SP మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రోజుకు రూ.2 వేల కోట్లు సైబర్ మోసాలతో ప్రజలు నష్టపోతున్నారని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో పోలీస్ సిబ్బంది సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.