AP: రాజధాని అమరావతిలో 30 శాతం గ్రీనరీకి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 133.3 కి.మీ పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండలో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్‌కు ప్రణాళిక రూపొందించామన్నారు.